కొన్ని తమిళ పదాలు మరియు వాక్యాలు - 1

Sasank Chilamkurthy | | 9 minutes to read.

తమిళనాడు ప్రభుత్వం వారు తమిళ పాఠాలను ఇంటర్నెట్లో అందుబాటులో వుంచరు. అవి నేను ఇక్కడ ఒక ప్లేలిస్టులో జేరుస్తున్నాను. ఈ వీడియోలు తెలుగులో కాక ఇంగ్లిష్ లో వున్నయి. నా కోసం ఇంకా మీ కోసం ఈ పాఠాలలో నేర్పించే పదాలని మరియు వాక్యాలని కింద పట్టికలో రాస్తున్నాను. ఈ పోస్ట్ లో మొదటి 15 పాఠాలలో నేర్పించిన పదాలు ఉన్నాయి. పదాలు పైనవున్న అంకె మీద నొక్కితే ఆయా పాఠాలు వస్తాయి. ఇంతకు ముందు మనం నేర్చుకున్న తమిళ్ ని చదవటం ఇక్కడ సాధన చెయచ్చు.

தமிழ் లిప్యంతరీకరణ తెలుగు
  4  
 கண்  కణ్  కన్ను
 பல்  పల్  పన్ను
 என்  ఎన్  నా
 உன்  ఉన్  నీ
கால் కాల్ కాలు
 கல்  కల్  రాయ
நாய் నాయ్ కుక్క
நான் నాన్ నేను
   5  
நாள் నాళ్ రోజు
  6  
எலி ఎలి ఎలుక
ஏரி ఏరి ఏరు
கிளி కిళి చిలుక
மணி మణి గంట
நரி నరి నక్క
ஓநாய் ఓనాయ్ తోడేలు
மயில் మయిల్ నెమలి
அணில் అణిల్ ఉడత
கழி కళి కర్ర
பல పల చాలా
பலா పలా పనస
   7  
கீழ் కీళ్ కింద
தீ తీ నిప్పు
நீ నీ నువ్వు
நீர் నీర్ నీరు
மீன் మీన్ చేప
  8  
புல் పుల్ గడ్డి
முள் ముళ్ ముళ్ళు
துணி తుణి బట్ట/గుడ్డ
புழு పుళు పురుగు
  9  
ஆறு ఆరు ఆరు/నది
ஏழு ఏళు ఏడు
ஒன்று ఒన్రు ఒకటి
பூ పూ పువ్వు
முன்று మున్రు మూడు
தூன் తూన్ స్థంబం
நூல் నూల్ నూలు
நல்ல నల్ల మంచి
பக்கம் పక్కమ్ పక్క
அக்கா అక్కా అక్క
அண்ணன் అన్నన్ అన్న
அம்மா అమ్మా అమ్మ
அப்பா అప్పా నాన్న
தாத்தா తాత్తా తాత
பாட்டி పాట్టి మామ్మ
எட்டு ఎట్టు ఎనిమిది
தட்டு తట్టు పళ్ళెం
பட்டம் పట్టం గాలిపటం
குற்றம் కుట్రం కుట్ర
தண்ணிர் తన్నీర్ చన్నీళ్ళు
பள்ளம் పళ్ళం గొయ్య
   10  
கேட்ட కెట్ట చెడ్డ
செய் చెయ్ చేయటం
பெண் పెణ్ అమ్మాయి
நெல் నెల్ వరి
பெரிய పెరియ పెద్ద
செறிய చెరియ చిన్న
என்ன ఎన్న ఏమిటి
ஏன் ఏన్ ఎందుకు
யார் యార్ ఎవరు
நான் నాన్ నేను
   11  
கேள் కేళ్ ప్రశ్నించటం/వినటం
கேள்வி కేల్వి ప్రశ్న
தென் తెన్ తేనె
தேள் తేళ్ తేలు
வேர் వేర్ వేరు
கீழ்/கீழே కీళ్/కీళే కింద
மேல்/மேலே మేల్/మేలే పైన
அங்கே అంగే అక్కడ
இங்கே ఇంగే ఇక్కడ
எங்கே ఎంగే ఎక్కడ
இங்கே வா ఇంగే వా ఇక్కడికి రా
அங்கே நில். అంగే నిల్. అక్కడ నుంచో.
   12  
பஞ்சு పంజు పత్తి
மஞ்சள் మంజళ్ పసుపచ్చ
நண்டு నన్డు పీత
வண்டு వన్డు తేనేటిగ
அந்த అంద ఆ (అది)
இந்த ఇంద ఈ (ఇది)
எந்த ఎంద ఏ (ఏది)
பாம்பு పామ్బు పాము
நம்பு నమ్బు నమ్మటం
கீழே/மேலே  பார். కీలే/మేలే పార్. కింద/పైన చూడు.
நான் నాన్ నేను
என் ఎన్ నా
நீ నీ నువ్వు
உன் ఉన్ నీ
உன் பெயர் என்ன? ఉన్ పెయర్ ఎన్న? నీ పేరు ఏంటి?
என் பெயர் ஷஷன்க். ఎన్ పేయర్ శశాంక్. నా పేరు శశాంక్.
அவன் என் அண்ணன். అవన్ ఎన్ అన్నన్. అతను నా అన్న.
இவன் என் தம்பி. ఇవన్ ఎన్ తంబి. ఇతను నా తమ్ముడు.
   13  
கை కై చెయ్య
கால் కాల్ కాలు
பை పై సంచి
தலை తలై తల
மலை మలై పర్వతం
மழை మళై వర్షం
காலை కాలై ఉదయం
மாலை మాలై సాయంత్రం
வேலை వెల్లై పని
புனை పునై పిల్లి
யானை యానై ఏనుగు
   14  
இலை ఇలై ఆకు
இல்லை ఇల్లై కాదు
நாள் నాళ్ రోజు
நாளை నాళై రేపు
(தமிழ்) மொழி (తమిళ్) మొళి (తమిళ్) భాష
கோல் కొల్ చంపటం
கொள் కొళ్ తీసుకోవటం
கொள்ளு కొళ్ళు ఉలవలు
தொழில் తోళిల్ వృత్తి
பொன் పొన్ బంగారం
வெள்ளு వెళ్లి వెండి
தொட்டில் తొట్టిల్ ఉయ్యాల
கட்டில் కట్టిల్ మంచం
தாய் తాయ్ అమ్మ
தாய் மொழி తాయ్ మొళి మాతృ భాష
என் மொழி தெலுங்கு மொழி ఎన్ తాయ్ మొళి తెలుంగు మొళి నా మాతృ భాష తెలుగు భాష.
   15  
கோல் కోల్ కర్ర
கோயில்/கோவில் కోయిల్/కోవిల్ కోవెల - గుడి
கோலம் కోలం ముగ్గు
கோழி కోళి కోడి
சேவல் చేవల్ కోడిపుంజు
கோட்டை కోట్టై కోట
கொட்டை కొట్టై విత్తనం
தோல் తోల్ తోలు
தோள் తోళ్ భుజం
போல்/போல పోల్/పోల పోలి
நோய் నోయ్ జబ్బు

ఇలాగే మిగితా పాఠాలలో నేర్పించిన పదాలని తదుపరి పోస్ట్లలో రాస్తాను.