తమిళ అంకెలు మరియు బహువచనాలు
ఈ పోస్ట్ లో తమిళ్ లో అంకెలు మరియు బహువచనాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇది అంకెలతో మొదలపెడదాము. ఇది 27వ పాఠము.
| தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు | అంకె |
|---|---|---|---|
| ஒன்று | ఒండ్రు | ఒకటి | 1 |
| இரண்டு | ఇరండు | రెండు | 2 |
| முன்று | ముండ్రు | మూడు | 3 |
| நான்கு | నాంగు | నాలుగు | 4 |
| ஐந்து | ఐందు | ఐదు | 5 |
| ஆறு | ఆరు | ఆరు | 6 |
| எழு | ఎళు | ఏడు | 7 |
| எட்டு | ఎట్టు | ఎనిమిది | 8 |
| ஒன்பகு | ఒన్బదు | తొమ్మిది | 9 |
| பாத்து | పత్తు | పది | 10 |
ஒரு/ஓர் (ఒరు/ఒర్) అనేవి ஒன்று యొక్క విశేషణ రూపం. అనగా తెలుగులో వీటి అర్థం ‘ఒక’ . ஒரு హల్లులతో మొదలయ్యే పదాలకి మరియి ஓர் అచ్చులతో మొదలయ్యే పదాలకి మాత్రమే వాడతారు. ఉదాహరణకి ஓர் உர் (ఒర్ ఉర్) అంటే ‘ఒక ఊరు’. ఇప్పుడు తమిళ్ లో ఏకవచన్నాని బహువచనానికి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.
கள் ని ఏకవచన పదాలకు చివరిలో జేరిస్తే అవి బహువచనాలు అవుతాయి. మీరు గమనిస్తే సర్వనామ పదాలకు కూడా ఇదే నియమము వర్తించింది. ఇప్పుడు కొన్ని ఉదాహరణాలు చూద్దాం.
| தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు |
|---|---|---|
| உர் + கள் = ஊர்கள் | ఊర్గళ్ | ఊరులు |
| ஆண் +கள் = ஆண்கள் | ఆంగళ్ | మగవాళ్ళు |
| பெண் + கள் = பெண்கள் | పెంగళ్ | ఆడవాళ్లు |
| கண் + கள் = கண்கள் | కంగళ్ | కళ్ళు |
| கால் + கள் = கால்கள் | కాల్గళ్ | కాళ్ళు |
| வீடு + கள் = வீடுகள் | వీడుగళ్ | ఇళ్ళు |
| அறு + கள் = அறுகள் | ఆరుగళ్ | నదులు |
| வழி + கள் = வழிகள் | వళిగళ్ | దారులు |
| நான் + கள் = நான்கள் | నాంగళ్ | మేము |
కొన్ని పదాలకి கள் చేరిస్తే చిన్న మార్పులు వస్తాయి. అలంటి కొన్ని పదాలు చూద్దాం.
| தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు | |
|---|---|---|---|
| 1 | பழம் + கள் = பழங்கள் | పళన్గళ్ | ఫలములు |
| மரம் + கள் = மரங்கள் | మరన్గళ్ | చెట్లు | |
| படம் + கள் = பழங்கள் | పడన్గళ్ | చిత్రాలు | |
| பாடம் + கள் = பழங்கள் | పాడన్గళ్ | పాఠాలు | |
| 2 | கல் + கள் = கற்கள் | కర్గళ్ | రాళ్లు |
| பல் + கள் = பற்கள் | పర్గళ్ | పళ్ళు | |
| 3 | பூ + கள் = பூக்கள் | పూక్కల్ | పూలు |
| ஈ + கள் = ஈக்கள் | ఈక్కల్ | ఈగలు |