తమిళ అక్షరమాల
ఇప్పుడు తమిళ్ లిపిని తెలుగు ద్వారా చదవటం నేర్చుకుందాం. తెలుగు మాదిరిగానే తమిళ్ లో కూడా అచ్చులు, హల్లులు, గుణింతాలు వుంటాయి. ఇక అచ్చులుతో మొదలపెడదాము.
உயிரெழுத்து - అచ్చులు:
| தமிழ் | తెలుగు |
|---|---|
| அ | అ |
| ஆ | ఆ |
| இ | ఇ |
| ஈ | ఈ |
| உ | ఉ |
| ஊ | ఊ |
| எ | ఎ |
| ஏ | ఏ |
| ஐ | ఐ |
| ஒ | ఒ |
| ஓ | ఓ |
| ஔ | ఔ |
மெய்யெழுத்து – హల్లులు:
| தமிழ் | తెలుగు |
|---|---|
| க | క/గ |
| ங | ఙ |
| ச | చ/శ |
| ஞ | ఞ |
| ட | ట/డ |
| ண | ణ |
| த | త/ద |
| ந | న |
| ப | ప/బ |
| ம | మ |
| ய | య |
| ர | ల |
| ல | య |
| வ | వ |
| ழ | ఱ + ళ |
| ள | ళ |
| ன | న |
| ஶ | - |
| ஜ | జ |
| ஷ | ష |
| ஸ | స |
| ஹ | హ |
| ஹ | హ |
| க்ஷ | క్ష |
గమనిక: க సందర్బం ప్రకారం క అని లేదా గ అని పలుకుతారు. ఇదే విధంగా ச, ட, த, ப సందర్బానుసారం పైన చూపించన విధంగా పలుకుతారు. ழ కి తెలుగులో సరిసమానమైన అక్షరం లేదు. దీన్ని సరిగ్గా పలకటం సులువు కాదు - సహాయం కోసం ఇక్కడ చుడండి. ஶ సంస్కృత పదాలు కోసం మాత్రమే వాడుతారు. కాబట్టి మాములగా తమిళ్ లో పెద్ద కనిపించదు.
உயிர்மெய்யெழுத்து - గుణింతాలు
| தமிழ் | తెలుగు |
|---|---|
| க் | క్ |
| க் + அ = க | క్ + అ = క |
| க் + ஆ = கா | క్ + ఆ = కా |
| க் + இ = கி | క్ + ఇ = కి |
| க் + ஈ = கீ | క్ + ఈ = కీ |
| க் + உ = கு | క్ + ఉ = కు |
| க் + ஊ = கூ | క్ + ఊ = కూ |
| க் + எ = கெ | క్ + ఎ = కె |
| க் + ஏ = கே | క్ + ఏ = కే |
| க் + ஐ = கை | క్ + ఐ = కై |
| க் + ஒ = கொ | క్ + ఒ = కొ |
| க் + ஓ = கோ | క్ + ఓ = కో |
| க் + ஔ = கௌ | క్ + ఔ = కౌ |
ఇలాగె మిగితా హల్లులుకి అచ్చులు జేరిస్తే అన్ని గుణింతాలు వస్తాయి. అవన్ని కింద చూడవచ్చు. తెలుగు లాగానే ఇవన్ని ఒకే లాగా వుంటాయి.
| அ | ஆ | இ | ஈ | உ | ஊ | எ | ஏ | ஐ | ஒ | ஓ | ஔ | |
| க் | க | கா | கி | கீ | கு | கூ | கெ | கே | கை | கொ | கோ | கௌ |
| ங் | ங | ஙா | ஙி | ஙீ | ஙு | ஙூ | ஙெ | ஙே | ஙை | ஙொ | ஙோ | ஙௌ |
| ச் | ச | சா | சி | சீ | சு | சூ | செ | சே | சை | சொ | சோ | சௌ |
| ஞ் | ஞ | ஞா | ஞி | ஞீ | ஞு | ஞூ | ஞெ | ஞே | ஞை | ஞொ | ஞோ | ஞௌ |
| ட் | ட | டா | டி | டீ | டு | டூ | டெ | டே | டை | டொ | டோ | டௌ |
| ண் | ண | ணா | ணி | ணீ | ணு | ணூ | ணெ | ணே | ணை | ணொ | ணோ | ணௌ |
| த் | த | தா | தி | தீ | து | தூ | தெ | தே | தை | தொ | தோ | தௌ |
| ந் | ந | நா | நி | நீ | நு | நூ | நெ | நே | நை | நொ | நோ | நௌ |
| ப் | ப | பா | பி | பீ | பு | பூ | பெ | பே | பை | பொ | போ | பௌ |
| ம் | ம | மா | மி | மீ | மு | மூ | மெ | மே | மை | மொ | மோ | மௌ |
| ய் | ய | யா | யி | யீ | யு | யூ | யெ | யே | யை | யொ | யோ | யௌ |
| ர் | ர | ரா | ரி | ரீ | ரு | ரூ | ரெ | ரே | ரை | ரொ | ரோ | ரௌ |
| ல் | ல | லா | லி | லீ | லு | லூ | லெ | லே | லை | லொ | லோ | லௌ |
| வ் | வ | வா | வி | வீ | வு | வூ | வெ | வே | வை | வொ | வோ | வௌ |
| ழ் | ழ | ழா | ழி | ழீ | ழு | ழூ | ழெ | ழே | ழை | ழொ | ழோ | ழௌ |
| ள் | ள | ளா | ளி | ளீ | ளு | ளூ | ளெ | ளே | ளை | ளொ | ளோ | ளௌ |
| ற் | ற | றா | றி | றீ | று | றூ | றெ | றே | றை | றொ | றோ | றௌ |
| ன் | ன | னா | னி | னீ | னு | னூ | னெ | னே | னை | னொ | னோ | னௌ |
తమిళ్ లో ప్రత్యేకంగా ఒత్తులు వుండవు. వాటి బదులు హల్లుల యెక్క ’்’ రూపము వాడతారు. ఉదాహరణకు அம்மா ని అమ్మ అని చదువుతారు.
ఇప్పుడు ఒక అభ్యాసం చేద్దాం. వీటిని చదివి తెలుగులో రాయండి :
- தாதா
- தம்பி
- அக்கா
- சிங்கம்
- ஜிகர்தண்டா
సమాధానాలు :
- తాతా
- తంబి
- అక్కా
- సింగమ్
- జిగర్ తణ్డా
ங, ட, ண, ய, ர, ல, ழ, ள, ஜ, ன తో తమిళ పదాలు మొదలవవ్వు. అలగే అచ్చులతో పదాలు అంతమవ్వవు.