తమిళ్ లో క్రియా పదాలు - 1
తెలుగు లాగానే ప్రతి క్రియా పదానికి రెండు సూచికలు చివర్లో ఉంటాయి. ఒకటి కాలాన్ని సూచిస్తే ఇంకొకటి వ్యక్తిని సూచిస్తుంది. ఈ రెండు లేని క్రియ తెలుగు లాగే ఆజ్ఞలా పని చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక నుంచి నేను తమిళ్ పదాలుకు లిప్యంతరీకరణ ఇవ్వను.
| தமிழ் | తెలుగు |
|---|---|
| செய் | చేయి |
| எழுது | రాయి |
| ஓடு | పరిగెత్తు |
| ஆடு/விளையாடு | ఆడు |
| பாடு | పాడు |
| போ | వెళ్ళు/పో |
| செல் | |
| கொடு | ఇవ్వు |
| பாடு | పాడు |
| துங்கு | నిద్రపో |
| உறங்கு | |
| வா | రా |
| தா | ఇవ్వు |
వర్తమాన కాలానికి క్రియా సూచిక கிறு. వ్యక్తి సూచికలు కింద పట్టికలో ఉన్నాయి.
| సర్వనామం | వ్యక్తిగత సూచిక | ||
|---|---|---|---|
| I | ఏక | நான் | ஏன் |
| బహు | நாம் | ஓம் | |
| நாங்கள் | |||
| II | ఏక | நீ | ஆய் |
| బహు | நீங்கள் | ஈர்கள் | |
| III | ఏక | அவன் | ஆன் |
| அவள் | ஆள் | ||
| அவர் | ஆர் | ||
| அது | அது | ||
| బహు | அவர்கள் | ஆர்கள் | |
| அவை/அவைகள் | அன | ||
ఇప్పుడు నేర్చుకున్న వాటితో కొన్ని పదాలను తయారుచేద్దాం.
| தமிழ் | తెలుగు | |
|---|---|---|
| 1 | செய் + கிறு + ஏன் = செய்கிறேன் | చేస్తున్నాను |
| எழுது + கிறு + ஏன் = எழுதுகிறேன் | రాస్తున్నాను | |
| ஓடு + கிறு + ஏன் = ஓடுகிறேன்நான் | పరిగేతుతున్నాను | |
| ஆடு + கிறு + ஏன் = அடுகிறேன் | ఆడుతున్నాను | |
| விளையாடுகிறேன் | ||
| பாடுகிறேன் | పాడుతున్నాను | |
| போகிறேன் | వెళ్తున్నాను | |
| கொல்கிறேன் | చంపుతున్నాను | |
| வெல்கிறேன் | గెలుస్తున్నాను | |
| துங்குகறேன் | నిద్రపోతున్నాను | |
| உறங்குகறேன் | ||
| 2 | கொடு+ கிறு + ஏன் = கொடு**க்**கிறேன் | ఇస్తున్నాను |
| பார்+ கிறு + ஏன் = ** **பார்**க்**கிறேன் | చూస్తున్నాను | |
| இரு + கிறு + ஏன் = **** ****இருக்கிறேன் | ఉన్నాను | |
| நடி+ கிறு + ஏன் = நடிக்கிறேன் | నటిస్తున్నాను | |
| படிக்கிறேன் | చదువుతున్నాను | |
| படுக்கிறேன் | పడుకున్నాను | |
| அடிக்கிறேன் | కొడుతున్నాను | |
| 3 | நில்+ கிறு + ஏன் = நி**ற்**கிறேன் | నుంచున్నాను |
| கல் + கிறு + ஏன் = க**ற்**கிறேன் | నేర్చుకుంటున్నాను | |
| வில் + கிறு + ஏன் = விற்கிறேன் | అమ్ముతున్నాను | |
| 4 | வா + கிறு + ஏன் = வருகிறேன் | వస్తున్నాను |
| தா + கிறு + ஏன் = தருகிறேன் | ఇస్తున్నాను |
తెలుగు మాదిరి గానే తమిళ్ లో సకర్మక మరియు అకర్మక క్రియా పదాలు ఉంటాయి. (సకర్మక క్రియాపదం కర్మని తీసుకుంటుంది, అకర్మక క్రియాపదం తీసుకోదు). తెలుగు లాగానే కొన్ని క్రియలు ఈ రెండు రూపాలని తీసుకోగలవు.
| தமிழ் | తెలుగు |
|---|---|
| கெடுகிறேன் | పాడవుతున్నాను (అకర్మక) |
| கெடுக்கிறேன் | పాడుచేస్తున్నాను (సకర్మక) |
| அழிகிறேன் | నాశనమవ్వుతున్నాను (అ) |
| அழிக்கிறேன் | నాశనంచేస్తున్నాను (స) |
| ஓடிகிறேன் | విరుగుతున్నాను (అ) |
| ஒடிக்கிறேன் | విరగ్గకోడుతున్నాను (స) |
ఈ పోస్ట్ లో நான் కి సంబంధించి క్రియాపదాలను చూసాం. వచ్చే పోస్ట్ లో మిగితా సర్వనామాలకి సంబంధించిన క్రియాపదాలను చూద్దాం.