తమిళ్ లో క్రియా పదాలు - 2

sasankchilamkurthy | | 3 minutes to read.

ఈ పోస్ట్ లో நான் తప్ప మిగితా సర్వనామలతో క్రియారూపం ఎలా మారుతుందో చూద్దాం.మునుపటి పోస్ట్ లోవి అర్ధమైయితె ఇది చాలా సునాయాసం. చివరి రెండు అక్షరాలు మారిస్తే చాలు. అది ఎలానో చూద్దాం.

தமிழ் తెలుగు
 நாம்/ நாங்கள்  செல் + கிறு + ஓம் = செல்கிறோம்  మనము/ మేము వెళ్తున్నాము
 போகிறோம்   వెళ్తున్నాము
 நீ போ + கிறு + ஆய் = போகிறாய்  నువ్వు వెళ్తున్నావు
 எழுதுகிறாய்  రాస్తున్నావు
 படிக்கிறாய்  చదువుతున్నావు
 நிற்கிறாய்  నుంచున్నావు
 வருகிறாய்  వస్తున్నావు
 தருகிறாய்  ఇస్తున్నావు
 இருக்கிறாய்  ఉన్నావు
 நீங்கள்  போ + கிறு + ஈர்கள்  = போகிறீர்கள்  మీరు  వెళ్తున్నారు
 எழுதுகிறீர்கள்  రాస్తున్నారు
 நடக்கிறீர்கள்  నడుస్తున్నారు
 வருகிறீர்கள்  వస్తున్నారు
 இருக்கிறீர்கள்  వున్నారు
 நீங்கள் இங்கே வருகிறீர்கள்.  మీరు ఇక్కడకి వస్తున్నారు.
 நீங்கள் அங்கே போகிறீர்கள்.  మీరు అక్కడకి వెళ్తున్నారు.
 அவன்  தூங்கு + கிறு +ஆன்  = தூங்குகிறான்  అతను  నిద్రపోతున్నాడు
 படிக்கிறான்  చదువుతున్నాడు
 எழுதுகிறான்  రాస్తున్నాడు
 சொல்கிறான்  చెప్తున్నాడు
 வருகிறான்  వస్తున్నాడు
 கண்ணன் படிக்கிறான்.  కణ్ణన్ చదువుతున్నాడు.
 அவள்  எழுது + கிறு +ஆள்  = எழுதுகிறாள்  ఆమె  రాస్తుంది
 வருகிறாள்  వస్తుంది
 தருகிறாள்  ఇస్తుంది
வள்ளி எங்கே இருக்கிறாள்? వళ్లి ఎక్కడ ఉంటుంది?
 மாதவி எழுதுகிறாள். మాధవి రాస్తుంది.
 அது  போ + கிறு +அது = போகிறது  అది  వెళ్తుంది
 துரத்து+ கிறு +அது = துரத்தகிறது  తరుముతుంది
 எலி கடிக்கிறது.  ఎలుక కరుస్తుంది.
 நாய் ஓடுகிறது.  కుక్క పరిగెడుతుంది.
 புலி எங்கே இருக்கிறது? పులి ఎక్కడ వుంది?
 கிளி பேசுகிறது. చిలుక మాట్లాడుతుంది.
 அவர்  எழுது + கிறு +ஆர்  = எழுதுகிறார்  అయన/ ఆవిడ  రాస్తున్నారు
 வருகிறார்  వస్తున్నారు
 ஆசிரியர் சொல்கிறார். ఆచార్యులు చెప్తున్నారు.
 அவர்கல்  எழுது + கிறு +ஆர்கல்  = எழுதுகிறார்கல்  వాళ్ళు  రాస్తున్నారు
 பத்து நண்பர்கள் ஓடுகிறார்கள். పది స్నేహితులు పరిగేతుతున్నారు.
 ஐந்து நண்பர்கள் வருகிறார்கள். అయిదు స్నేహితులు వస్తున్నారు.
அவை/ அவைகள்  குரை + கின்று +அன = குறைக்கின்றன  అవి  మొరుగుతున్నాయి
ஆடுகள் ஓடுகின்றன. మేకలు పరిగెడుతున్నాయి.
நாய்கள் குறைக்கின்றன. కుక్కలు మొరుగుతున్నాయి.

గమనిక:அவை కి கிறு బదులు கின்று ని కాలసూచికగా వాడతాము. వీటి రెండిటి మద్య ఇది కాక ఇంకేమి  ఏమి వ్యత్యాసం లేదు. కాబట్టి கின்று ని  అన్ని సర్వనామపదాలకు వాడవచ్చు. ఉదాహరణకు அவர் எழுதுகின்றார் అనేది సరైన వాక్యం.

ఇప్పుడు కొన్ని వాక్యాలతో పాటు కొత్త పదాలు నేర్చుకుందాం.

தமிழ் తెలుగు
 ஆறு பார்கிறது.  నది ప్రవహిస్తుంది.
 மழை பெய்கிறது.  వర్షం పడుతుంది.
 மாணவர்கள் கற்கிறார்கள்.  విద్యార్థులు చదువుతున్నారు.
 நான் அவனை அடிக்கிறேன்.  నేను అతన్ని కొడుతున్నాను.