తమిళ్ లో ద్వితీయా విభక్తి ('ని')

sasankchilamkurthy | | 4 minutes to read.

మునుపటి పోస్ట్ లో మనం நான் அவனை அடிக்கிறேன் అనే వాక్యాన్ని నేర్చుకున్నాం. దీని అర్ధం ‘నేను అతన్ని కొడుతున్నాను’. గమనిస్తే அவனை అంటే ‘అతన్ని’ అని అర్థమయితుంది. తెలుగులో దీన్ని ద్వితీయా విభక్తి అంటాం. ఈ విభక్తి కోసం తెలుగులో ’ని’ ని చేర్చినట్టే తమిళ్ లో ‘ஐ’ ని చేరుస్తాం. ఇలా చేర్చటంతో పదం కర్త నుండి కర్మగా మారుతుంది. ఇప్పుడు ’ஐ’ ని తమిళ పదాలకు చివర్లో ఎలా చేర్చాలో చూద్దాం.

தமிழ் తెలుగు
 1  அவன் + ஐ = அவனை  అతన్ని
 நீ அவனை அழை க்கிறாய்.  నువ్వు అతన్ని పిలుస్తున్నావు.
அவர் ஒரு நூலை எழுதுகிறார்.  అయన ఒక పుస్తకాన్ని రాస్తున్నారు.
 வாய் + ஐ = வாயை  నోరుని
 கடல் + ஐ = கடலை  సముద్రాన్ని
 கதவு + ஐ = கதவை  తలుపుని
 நான் கதவை மூடு கிறேன்.  నేను తలపుని ముసివేస్తున్నాను.
 நெருப்பு + ஐ = நெருப்பை  నిప్పుని
 2  கண் + ஐ = கண்ணை  కంటిని
 கல் + ஐ = கல்லை எறி.  రాయని విసురు.
 சொல்லை எழுது.  పదాన్ని రాయి.
 வில் ​+ ஐ =வில்லை  విల్లుని
 புல் ​+ ஐ = புல்லை  గడ్డిని
 பசு புல்லை மேய் கிறது.  పశువు గడ్డిని మేస్తుంది.
 பல்லைக் காட்டு.  పంటిని చూపు.
 சொல்லைப் படி.  పదాన్ని చదువు.
 3  கிளி + ஐ = கிளியை  చిలుకని
 புலி + ஐ = புலியை  పులిని
 மணி + ஐ = மணியை அடி.  గంటని కొట్టు.
 தீ + ஐ = தீயை  నిప్పుని
 நீ தீயை அணை(க்கிறாய்).  నువ్వు నిప్పుని అర్పు(తున్నావు).
 கை + ஐ = கையை நீட்டு.  చేతిని చాపు.
 பை + ஐ = பையை எடு.  సంచిని ఎత్తు.
 தலை ​+ ஐ = தலையை  తలని
 4  கொசு ​+ ஐ = கொசுவை  దోమని
 அம்மா + ஐ = அம்மாவை  అమ్మని
 அப்பா + ஐ = அப்பாவை  అన్నని
 தாத்தா + ஐ = தாத்தாவை  తాతని
 5  வீடு + ஐ = வீட்டை  ఇల్లుని
 வீட்டைக் கட்டு.  ఇల్లుని కట్టు.
 வீட்டைப் பார்.  ఇల్లుని చూడు.
 காடு + ஐ = காட்டை  అడివిని
 நாடு + ஐ = நாட்டை  దేశాన్ని
 ஆறு + ஐ = ஆற்றை  నదిని
 ஆற்றைக் கட.  నదిని దాటు.
 6  மரம் + ஐ = மரத்தை வெட்டு.  చెట్టుని నరుకు.
 மரத்தைப் பார்.  చెట్టుని చూడు.
 பணம் + ஐ = பணத்தை  డబ్బుని
 குளம் + ஐ = குலத்தை  చెరువుని
 புத்தகத்தைப் படி.  పుస్తకాన్ని చదువు.

ம் తో ముగిసే పదాలకి ஐ చేర్చటానికి ம் ని அத்து తో మారుస్తారు. ఉదాహరణకి புத்தகம் + அத்து + ஐ = புத்தகத்தை.

వ్యాకరణం

ద్వితీయా విభక్తి వున్న పదానికి తర్వాత க, ச, ட, த, ப, ற లతో మొదలయే తమిళ పదం వస్తే ఆ హల్లుని ముందు పదానికి చివరిలో చేర్చాలి. (ட,ற తో మొదలయ్యే తమిళ పదాలు ఉండవు. కాబట్టి వీటిని పట్టించుకోవక్కరలేదు). ఉదాహరణకి வீட்டைக் கட்டு అంటే ఇల్లుని కట్టు అని అర్ధం. வீட்டை పదానికి க் చేర్చి வீட்டைக் ఎలా అయ్యిందో గమనించండి. ఇదే విధంగా வீட்டைப் பார் అంటే ఇల్లుని చూడు అని అర్ధం.

ఇప్పుడు సర్వనామాలకు ஐ ని ఎలా కలపాలో చూద్దాం.

தமிழ் తెలుగు
 நான்  என் + ஐ = என்னை  నన్ను
 நீ  உன் + ஐ = உன்னை  నిన్ను
 நான் உன்னைப் பார்க்கிறேன்.  నేను నిన్ను చూస్తున్నాను.
 நீ என்னை பார்க்கிறாய்.  నువ్వు నన్ను చూస్తున్నావు.
 நாம்  நம் + ஐ = நம்மை  మనల్ని
 நாங்கள்  எங்கள் + ஐ = எங்களை  మమల్ని
 நீங்கள்  உங்கள் + ஐ = உங்களை  మిమల్ని
 அவர் உங்களை அழைக்கிறார்.  ఆయన మిమల్ని పిలుస్తున్నారు.
 அவன்  அவன் + ஐ = அவனை  అతన్ని
 அவள்  அவள் + ஐ = அவளை  ఆమెని
 அது  அது + ஐ = அதை/அதனை  దాన్ని
 அவர்கள்  அவர்கள் + ஐ = அவர்களை  వాళ్ళని/వారిని
 அவைகள்  அவைகள் + ஐ = அவைகளை  వాటిని
 அவை  அவை + ஐ = அவையை/அவற்றை

அதனை (அது + அன் + ஐ) అనేది గ్రాంథిక భాషలో వాడుతారు. తిరుక్కురళ్ (திருக்குறள்) అనేది తిరువళ్ళువర్ (திருவள்ளுவர்) రాసిన ఒక మహాపుస్తకం. అందులోంచి ఒక పద్యం ఇప్పుడు చూద్దాం!

‘இதனை, இதனால், இவன் முடிக்கும்’ என்று ஆய்ந்து, அதனை அவன்கண் விடல்!

మనకి దీన్లో చాలా పదాలు తెలుసు. ఆ పదాలు: இதனை, இவன், அதனை. ఇప్పుడు దీని తెలుగు అనువాదం చూద్దాం.

‘దీన్ని దీంతో ఇతను పూర్తి చేస్తాడు’ అని నిర్ణయించాక దాన్ని అతనికి వదిలేయ్!

అభ్యాసం: ఈ వాక్యాలను తెలుగులోకి అనువాదించిండి.

  1. நான் அந்த நாயை அடிக்கிறேன்.

  2. நீ இந்த மரத்தைப் பார்.

  3. அவன் ஒரு வீட்டைக் கட்டுகிறான்.

  4. பசு புல்லைத் தின்கிறது.

జవాబులు:

  1. నేను ఆ కుక్కని కొడుతున్నాను.

  2. నువ్వు ఆ చెట్టుని చూడు.

  3. అతను ఒక ఇంటిని కడతున్నాడు.

  4. ఆవు గడ్డిని తింటుంది.