తమిళ్ లో 'మరియు'
ఇప్పుడు తమిళ్ లో ‘మరియు’ ని ఎలా ప్రయోగిస్తారో చూద్దాం. ఇది 28వ, 29వ, 30వ పాఠాలలో వుంది. తమిళ్ లో ’మరియు’ కి உம் అనే పదాన్ని వాడతారు:
தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు |
---|---|---|
உம் | ఉమ్ | మరియు |
உம் పదాన్ని తెలుగుకి భిన్నంగా ప్రతి పదానికి చివర్లో జేరుస్తారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు | |
---|---|---|---|
1 | அவன் + உம் அவள் + உம் = அவனும் அவளும் | అవనుమ్ అవళుమ్ | అతను మరియు ఆమె |
மீன் + உம் குளம் + உம் = மீனும் குளமும் | మీనుం కులముమ్ | చేప మరియు చెరువు | |
மரம் + உம் பழம் + உம் =மரமும் பழமும் | మరముమ్ పళముమ్ | చెట్టు మరియు పండు | |
நாய் + உம் பயன் + உம் = நாயும் பயனும் | నాయుమ్ పయనుమ్ | కుక్క మరియు అబ్బాయి | |
2 | கண் + உம் கால் + உம் = கண்ணும் காலும் | కణ్ణుమ్ కాలుమ్ | కన్ను మరియు కాలు |
நெல் + உம் வயல் + உம் = நெல்லும் வயலும் | నెల్లుమ్ వయలుమ్ | వరి మరియు పొలం | |
3 | நாடு + உம் வீடு + உம் = நாடும் வீடும் | నాడుమ్ వీడుమ్ | దేశం మరియు ఇల్లు |
ஆடு + உம் மாடு + உம் = ஆடும் மாடும் | ఆడుమ్ మాడుమ్ | మేక మరియు ఆవు | |
இரவு + உம் பகல் + உம் = இரவும் பகலும் | ఇరవుమ్ పగలమ్ | రాత్రి మరియు పగలు | |
4 | மணி + உம் ஒலி + உம் = மணியும் ஒலியும் | మణియుమ్ ఒలియుమ్ | గంట మరియు శబ్దం |
கிளி + உம் காகம் + உம் = கிளியும் காகமும் | కిళియుమ్ కాగముమ్ | చిలుక మరియు కాకి | |
மொழி + உம் இலக்கியம் + உம் = மொழியும் இலக்கியமும் | మొళియుమ్ ఇలక్కియముమ్ | భాష మరియు సాహిత్యం | |
நான் + உம் நீ + உம் = நானும் நீயும் | నానుమ్ నీయుమ్ | నేను మరియు నువ్వు | |
நீர் + உம் தீ + உம் =நீரும் தீயும் | నీరుమ్ తీయుమ్ | నీరు మరియు నిప్పు | |
வால் + உம் தலை + உம் =வாலும் தலையும் | వాలుమ్ తలైయుమ్ | తోక మరియు తల | |
வால் + உம் தலை + உம் =வாலும் தலையும் | వాలుమ్ తలైయుమ్ | తోక మరియు తల | |
ஆறு + உம் மலை + உம் =ஆறும் மலையும் | ఆరుమ్ మలైయుమ్ | నది మరియు పర్వతం | |
புத்தகம் + உம் பை + உம் =புத்தகமும் பை யும் | పుత్తగముమ్ పైయుమ్ | పుస్తకం మరియు సంచి | |
5 | அது + உம் இது + உம் = அதுவும் இதுவும் | అదువుమ్ ఇదువుమ్ | అది మరియు ఇది |
அவன் + உம் కి సహజంగా సంధి అయ్యి அவனும் ఎలా అయ్యిందో గమనించండి.
மணி + உம் సంధి అయ్యి கிளியும் అవుతుంది. மணி పదంలో చివరి అచ్చు இ కావటంతో మద్యలో ய் వచ్చింది.
అలాగే கண் + உம் సంధి అయ్యి கண்ணும் ఎలా అయ్యిందో గమనించండి. దీనికి కారణం கண் లో 1) రెండు అక్షరాలే వున్నాయి 2) మొదటి అక్షరం దీర్గ హల్లు కాదు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చూద్దాం.
தமிழ் | లిప్యంతరీకరణ | తెలుగు |
---|---|---|
நெல் + உம் = நெல்லும் | నెల్లుమ్ | వరి |
மண் + உம் = மண்ணும் | మణ్ణుమ్ | భూమి |
கல் + உம் = கல்லும் | కల్లుమ్ | రాయి |
புல் + உம் = புல்லும் | పుల్లుమ్ | గడ్డి |
பெண் + உம் = பெண்ணும் | పెణ్ణుమ్ | అమ్మాయి |