తమిళ సర్వనామాలు

sasankchilamkurthy | | 2 minutes to read.

ఇప్పుడు సర్వనామాలు చూద్దాం. ఇవి 26వ పాఠంలో వున్నాయి.

தமிழ் లిప్యంతరీకరణ తెలుగు
I ఏక  நான்  నాన్  నేను
బహు  நாம்  నామ్  మనము
 நாங்கள்  నాంగళ్  మేము
 II ఏక  நீ  నీ  నువ్వు
బహు  நீங்கள்  నీంగళ్  మీరు
III ఏక  அவன்  అవన్  అతను
 அவள்  అవళ్  ఆమె
 அவர்  అవర్  ఆయన/ఆవిడ
 அது  అదు  అది
బహు  அவர்கள்  అవర్గల్  వాళ్ళు
 அவை/அவைகள் అవై/అవైగల్  అవి

మీరు గమనిస్తే ’கல்’ ని ఏకవచన సర్వనమాలకు చేరిస్తే బహువచనాలు అవుతున్నాయి. అన్ని పదాలకు ఇదే నియమం వర్తింస్తుంది. దీని గురుంచి ఇంకా తదుపరి పోస్ట్ లో చూద్దాం. ప్రస్తుతానికి పైన పదాలని వాడుతూ కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం.

தமிழ் లిప్యంతరీకరణ తెలుగు
 நான் அல்லது நி  నాన్ అల్లదు నీ  నేను లేదా నువ్వు
 அவ்வன் அல்லது அவ்வள்  అవన్ అల్లదు అవళ్  అతను లేదా ఆమె
 அது ஒரு (பெரிய ஆல)மரம்.  అదు ఓరు (పెరియ ఆల)మరం.  అది ఒక (పెద్ద మర్రి)చెట్టు.
 இது ஒரு செறிய வீடு  ఇదు ఓరు చెరియ వీడు  ఇది ఒక చిన్న ఇల్లు.

పనిలో పని ప్రశ్న పదాలని కుడా చూసేద్దాం.

தமிழ் లిప్యంతరీకరణ తెలుగు
 ஏன்  ఏన్  ఎందుకు
 என்ன  ఎన్న  ఏమిటి
 எப்போ  ఎప్పు  ఎప్పుడు
 யார்  యార్  ఎవరు
 எங்கே  ఎంగె  ఎక్కడ
 எது  ఎదు  ఏది
 எப்படி  ఎప్పడి  ఎలా
 எவ்வளவு  ఎవ్వళవు  ఎంత
 எத்தனை  ఎత్తనై  ఎన్ని