మరికొన్ని తమిళ పదాలు
ఇప్పటివరకు మనం చాలా తమిళ పదాలు నేర్చుకున్నాం. మనం చూసిన పదాలలో కొన్ని పదాలు సందర్బానుసారం నామవాచకంగాను క్రియాగాను ఉపయోగపడ్డాయి. கல் అలాంటి పదాలలో ఒకటి.
கல் | (క్రి.) నేర్చుకో |
(నా.) రాయి |
మరి ఈ రెండు అర్ధాల మద్య ఎలా వ్యత్యాసించాలి? నామవాచకం విబక్తి తీసుకోగా క్రియాపదం వ్యక్తిగత, కాల సూచికలు తీస్కుంటుంది. ఉదాహరణకి கல் పదం నామవాచకంగా கல்லை కి, క్రియాపదంగా கற்கிறேன் కి మారుతుంది. ఇలాంటి పదాలు ఇంకొన్ని చూద్దాం.
தமிழ் | తెలుగు | ఉదాహరణ |
---|---|---|
வில் | (క్రి.) అమ్ము | விற்கிறேன் |
(నా.) విల్లు | ||
சொல் | (క్రి.) చెప్పు | சொல்கிறேன் |
(నా.) పదం | இந்தச் சொல் | |
அடி | (క్రి.) కొట్టు | அடிக்கிறேன் |
(నా.) పాదం | ||
படி | (క్రి.) చదువు | படிக்கிறேன் |
(నా.) మెట్టు | ||
முடி | (క్రి.) ముగించు | முடிக்கிறேன் |
(నా.) కిరీటం, జుట్టు | ||
கழி | (క్రి.) తగ్గించు | கழிக்கிறாய் |
(నా.) కర్ర | ||
மோழி | (క్రి.) మాట్లాడు | |
(నా.) భాష | தமிழ் மொழியைக் கல். | |
ஆடு | (క్రి.) ఆడు | குழந்தைகள் ஆடுகின்றன. = விளையாடுகின்றன. |
(నా.) మేక | அவன் ஆட்டை மேய்க்கிறான். |
క్రియాపదాలకి చివర్లో ప్రత్యయాలు చేరిస్తే కొత్త పదాలు తయారుచేయవచ్చు. తెలుగు లో ఉదాహరణకి రాయిటం నుంచి రచయత ఎలా వచ్చిందో, అలానే తమిళ్ లో క్రియలు నుంచి వేరే పదాలు వస్తాయి.
தமிழ் | తెలుగు | |
---|---|---|
கல் | నేర్చుకోవటం | |
+ வி = கல்வி | విద్య | |
+ ஐ = கலை | కళ | |
வேல் | గెలువు | |
+ தி = வேற்றி | గెలుపు | |
தோல் | ఓడిపో | |
+ வி = தோல்வி | ఓటమి | |
செய் | చేయి | |
+ கை = செய்கை | చర్య | |
+அல் = செயல் | చర్య | |
+ தி = செய்தி | వార్త | |
கொடு | ఇవ్వు | |
+ ஐ = கோடை | బహుమానం | |
நன் + கோடை = நன்கொடை | విరాళం | |
தடு | ఆపు/అడ్డుకో | |
+ ஐ = தடை | అడ్డు | |
நட | నడువు | |
+ ஐ = நடை | నడక/శైలి | |
பற | ఎగురు | |
+ வை = பறவை | పక్షి | |
முடி | పూర్తిచెయి/ముగించు | |
+ வு = முடிவு | ముగింపు | |
படி | చదవు | |
+ ப்பு = படிப்பு | చదవు | |
நடி | నటించు | |
+ ப்பு = நடிப்பு | నటన | |
+ கர் = நடிகர் | నటుడు | |
எழுது | రాయి | |
எழுத்து | అక్షరం | |
முதல் எழுத்து | మొదటి అక్షరం | |
கடைசி எழுத்து | చివరి అక్షరం | |
நடு எழுத்து | మధ్య అక్షరం | |
+ ஆளர் = எழுத்தாளர் | రచయత |