தமிழ் & తెలుగు
తమిళ్ మరియు తెలుగు చాలా దగ్గర సంబంధమున్న భాషలు. రెండిటి మూలం ఒకే ద్రావిడ భాష. ఈ భాష నుంచే రెండు అభివృద్ధి చెందాయి. కాబట్టి చాలా పదాలు దగ్గరగా పోలి వుంటాయి. అంతకన్నా ముక్యంగా రెండు భాషల వ్యాకరణం ఇంచుమించు ఒకటే ఉంటుంది.
తెలుగు భాష సంస్కృతం నుంచి చాలా పదాలిని దిగుమతి చేసుకుంది. ఒక ఉదాహరణ చూద్దాం. కొడుకు కి మరో పదం పుత్రుడు లేదా కుమారుడు. ఈ రెండు పదాలు సంస్కృతం నుంచే వచ్చాయి. ఇలాంటి చాలా ఉదాహరణలు ఇక్కడ చూడవచ్చు. ఇంకా మీరు గమనిస్తే తెలుగు అక్షరాలు, సంస్కృత అక్షరాలు దాదాపు ఒకటే వుంటాయి. తెలుగు లిపి గురుంచి ఇంకా ఇక్కడ చదవండి.
తెలుగు వ్యాకరణం మరియి వ్యాకరణ పదాలు మాత్రం తమిళ్ కి దగ్గర పోలి వుంటుంది. ఉదాహరణకి ‘ఏది’ తమిళ్ లో ’எது’ (ఎదు), ‘నేను’ తమిళ్ లో ‘நான்’ (నాన్). ‘పుస్తకం ఎక్కడ వుంది?’ కి తమిళ్ అనువాదం ‘புத்தகம் எங்கே இர்ருக்கு?’ (పుత్తకం ఎంగె ఇరుక్కు?)
తదుపరి పోస్ట్ లో తమిళ్ ని చదవటం నేర్చుకుందాం.