అత్తగారి కథలు
రచయత : భానుమతి రామకృష్ణ
పరిచయం : అత్తా కోడళ్ల మధ్య జరిగే హాస్యభరిత కథల మాలిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
నేను పూర్తిచేసినది : 22 డిసెంబర్ 2017న
మొదలుపెట్టింది : 17 డిసెంబర్ 2017న
తెలుగు సాంస్కృతిక వాతావరణాన్ని ఈ పుస్తకంలో భానుమతిగారు చాలా బాగా ఇమిడ్చారు. కొన్ని విషయాలు కాస్త పాత కాలంలో లాగా ఉన్నా, ఈ పుస్తకం ఆధునిక తెలుగు ఇంటిని, కుటుంబాన్ని ఇప్పటికీ చక్కాగా ప్రతిబింబిస్తుంది. పదక్రమం వార్తల్లా కాకుండా వాడుక భాషలాగా ఉండటం వల్లనూ, అత్తగారు-కోడళ్ల పాత్రధారణ వల్లనూ, ఈ కధలు మన ఇంట్లో కుడా జరుగగలవు అని అనిపిస్తుంది.