ద్రౌపది
రచయత : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
పరిచయం : ద్రౌపది కోణం నుంచి మహాభారతం.సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
నేను పూర్తిచేసినది : 9 మే 2017న
మొదలుపెట్టింది : 2 మే 2017న
ద్రౌపది పుస్తకం పూర్తి చేశాను. చాలా నచ్చిందీ పుస్తకం. మహాభారతంలోని నవరసాలన్ని ఈ చిన్న పుస్తకంలో రచయత ఇమిడ్చినట్టు అనిపించింది. నాకు ఈ పుస్తకంలోని తెలుగు అంత కష్టంగా అనిపించలేదు. కానీ పదాలు, వాఖ్యలు ఒకేసారి చాలా కొత్తవి గాను, సహజంగాను అనిపించాయి. భారతం లోని చాలా ఘట్టాలు మన నిత్యజీవితంలోని ఘట్టాలను ప్రతిబాంబిస్తాయి అని అనిపించింది.
గమనిస్తే నేను అంతకు ముందుతో పోలిస్తే తెలుగును అవలీలగాను, భావాయుక్తంగాను రాయగలుగుతున్నాను. నాకు ఇంగ్లీషులోనే ఇలా రాయటం అలవాటు. బహుశా నా దినచర్యను తెలుగులో రాయలేమో!
ఇంకా ఇలాంటి తెలుగు పుస్తకాలు చదవాలని ఉంది!