హృదయనేత్రి

Sasank Chilamkurthy | |

రచయిత్రి: మాలతీ చందూర్‌
పరిచయం: సంఘసంస్కార్తల జీవితం. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
నేను పూర్తిచేసినది : 20 మే 2017న
మొదలుపెట్టింది : 15 మే 2017న

అస్సల నచ్చలే ఈ పుస్తకం. ఈ పుస్తకానికి ఎందుకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిందో అర్ధం కాలేదు. పుస్తకం పేరుకీ, అట్టకీ పుస్తకంలోని విషయానికి అసల్ల సంబంధమే లేదు. ఎక్కడో చివరి పేజీలో ‘హృదయనేత్రి’ అనే పదం ఇమడ్చారు రచయత.

మూడు తరాల సంఘసంకర్తల జీవితమే ఈ పుస్తక విషయం. నాకు సాహిత్యపరంగా ఈ పుస్తకానికి విశిష్టత ఏమి కనిపించలేదు. మాములు నవలలా, ఒక ప్రత్యేకత లేకుండా, కథను అల్లుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. అదీ కాక పాత్రల స్వభావాలలో నిలకడ లేనట్టు అనిపించింది. మొత్తానికి సాహిత్య అకాడెమీ అవార్డు రావలసిన పుస్తకం కాదు ఇది. ఎందుకు ఆ అవార్డు ఇచ్చారో తెలుసుకోవటానికి (citation) ఇంటర్నెట్లో వెతికాను కానీ ఏమీ దొరకలేదు.